యోగిబాబు లీడ్ రోల్ చేసిన తమిళ హిట్ ఫిల్మ్ మండేలాను తెలుగులో మార్టిన్ లూథర్ కింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మెయిన్ లీడ్ చేస్తున్నారు. నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా..పూజ కొల్లూరి దర్శకత్వం వహించారు. ఈ నెల 27న మార్టిన్ లూథర్ కింగ్ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ చూస్తే…ఒక ఊరి జనం ఉత్తరం, దక్షిణం వాళ్లుగా విడిపోయి ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. కలిసి ఉండమని ఆ ఊరి పెద్ద జగ్జగీవన్ రామ్ చెప్పినా పట్టించుకోరు. ఉత్తరం, దక్షిణం వాళ్లను కలపడం ఇక ఎవరి వల్లా సాధ్యం కాదు. ఈ టైమ్ లో ఊరిలో ఎలక్షన్స్ వస్తాయి. ఉత్తరం, దక్షిణం నుంచి ఈ ఎలక్షన్స్ ఒక్కో లీడర్ పోటీ పడతాడు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే ఒక ఓటు కావాల్సి ఉంటుంది. ఆ ఒక్క ఓటు విజేతను నిర్ణయిస్తుంది. ఇలాంటి టైమ్ లో అప్పటిదాకా ఊరిలో అనామకుడిగా ఉన్న మార్టిన్ లూథర్ కింగ్ అనే యువకుడి ఓటు గెలిచేందుంకు రెండు వర్గాలకు కావాల్సి ఉంటుంది. దీంతో రెండు వర్గాల వారు అతనికి రాచమర్యాదలు చేస్తారు. చివరకు మార్టిన్ లూథర్ కింగ్ ఎవరకి ఓటు వేశాడనేది ఆసక్తికరంగా చూపిస్తూ టీజర్ ముగుస్తుంది.
టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త తరహా మూవీ కానుంది. అయితే తమిళ నేటివిటి కనిపించకుండా చేయగలిగితే ఏమైనా పాజిటివ్ ఫలితం ఉండొచ్చు.