బోయపాటిపై మొదలైన విమర్శలు

స్కంధ సినిమా ఫలితం నేపథ్యంలో దర్శకుడు బోయపాటి మీద విమర్శలు మొదలయ్యాయి. ఆయన తన దర్శకత్వం చేసే పద్ధతిని, రూపొందించే కథల పట్ల ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ సూచనలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ టైమ్ లో ఫిక్సయిన రామ్ బోయపాటి ప్రాజెక్ట్…మేకింగ్ లోనే బడ్జెట్ ఓవర్ బోర్డ్ అయ్యింది. అది నిర్మాతకు తెలిసినా ఏమీ చేయలని పరిస్థితిలో ఉండిపోయాడు. బోయపాటి, రామ్ రెమ్యునరేషన్స్ కే 30 కోట్ల దాకా అయ్యిందని టాక్. ఇక మేకింగ్ లో భారీతనం చూశాక..ఇది రికవరీ కావాలంటే చాలా వసూళు చేయాలంటూ విమర్శలు వచ్చాయి.

అనుకున్నట్లుగానే కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాగా స్కంధ మిగిలిపోతోంది. ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లో ఫస్ట్ డే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల వసూళ్లు దాటింది. ఆ తర్వాత మూడున్నర కోట్లు కూడా చేయలేదు. నిన్న సండే మాత్రం 4 కోట్లు దాటింది. ఇవాళ గాంధీ జయంతి హాలీడే వదిలేస్తే మళ్లీ మంగళవారం నుంచి స్కంధ కలెక్షన్స్ భారీగా పడిపోనున్నాయి.

మినిమమ్ సినిమాను ఆకట్టుకునేలా తీయలేకపోయాడు బోయపాటి. ఇద్దరు సీఎంల కూతుర్లను ఓ రౌడీ లేపుకు వెళ్లడం, హీరోకు ఏదైనా చెల్లుతుంది అని దర్శకుడు అనుకోవడం పెద్ద బ్లండర్. ఆ తర్వాత వచ్చే నీతి వాక్యాలు ఏవీ ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో స్కంధ ఔట్ డేటెడ్ మూవీగా మిగిలిపోయింది. మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి ఈ సినిమాకు వచ్చింది 25 కోట్ల రూపాయలు మాత్రమే. దీంతో స్కంధ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంతకు దాదాపు మూడు రెట్లు చేయాలి.