“చంద్రముఖి” ఎఫెక్ట్ – అప్పుడు వెంకటేష్, ఇప్పుడు లారెన్స్ కు

చంద్రముఖి కథతో వచ్చిన సినిమాల్లో కన్నడలో విష్ణువర్థన్ సినిమా హిట్ అయితే..ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్ సినిమా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎవరికీ సూట్ కాలేదు. ఆ కథలోని మ్యాజిక్ మరోసారి వర్క్ వుట్ కాలేదు. తెలుగులో వెంకటేష్, అనుష్క కలిసి చంద్రముఖి సీక్వెల్ అంటూ అప్పట్లో నాగవళ్లి అనే సినిమా చేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా పరాజయం పాలైంది.

ఇక తాజాగా లారెన్స్ హీరోగా వచ్చిన చంద్రముఖి 2 కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. కంగనా హీరోయిన్ దర్శకుడు పి వాసు ఈ సినిమాను తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీగా నిర్మించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాక రివ్యూవర్స్ నుంచి కూడా బ్యాడ్ టాక్ వచ్చింది.

కేవలం క్యారెక్టర్స్ ను మార్చి అదే కథను మళ్లీ తెరకెక్కించడంపై విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ నెంబర్స్ కూడా చాలా లీస్ట్ గా వస్తున్నాయి. థియేటర్స్ లో ఆడియెన్స్ కనిపించడం లేదు. ఇవన్నీచూస్తుంటే…చంద్రముఖి మళ్లీ మళ్లీ ఆ ఫీల్ తీసుకొచ్చే సినిమా కాదని..అది అందరు హీరోలకు సెట్ కాదని అర్థమవుతోంది.