కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమా ట్రైలర్ రిలీజైంది. పాన్ ఇండియా స్థాయిలో పలువురు స్టార్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో దర్శకుడు రాజమౌళి ఘోస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ దసరా పండుగ పోటీలో ఈ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ఈ నెల 19న ఘోస్ట్ థియేటర్స్ లోకి వస్తోంది.
సామ్రాజ్యాలు నిర్మించిన వాడి కంటే ధ్వంసం చేసిన వాడినే చరిత్ర ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది చెబుతూ యాక్షన్, హీరోయిజం ఎలివేషన్స్ తో ఘోస్ట్ సినిమా ట్రైలర్ సాగింది. ట్రైలర్ నిండా భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. అనుపమ్ ఖేర్, జయరామ్, అర్చనా జాయిస్ కీ రోల్స్ లో నటించారు. ఈ సినిమాను దర్శకుడు శ్రీని రూపొందించారు.