నెలరోజుల తర్వాతే మళ్లీ సెట్ లోకి

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఆయన తన మోకాలి సర్జరీ కోసం లండన్ వెళ్లారు. రీసెంట్ గా సక్సెస్ ఫుల్ గా ప్రభాస్ కు మోకాలి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ సూచించారట. దీంతో ఇండియా రాకుండా అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రభాస్.

ప్రభాస్ పూర్తిగా కోలుకునేందుకు మరో నెలకు పైగా సమయం పట్టేలా ఉంది. నవంబర్ లో ఆయన తన కొత్త సినిమాల సెట్ లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో మారుతి డైరెక్షన్ మూవీ, కల్కి 2898ఏడీ షూటింగ్స్ జరుగుతున్నాయి. తనకు క్యూర్ అయ్యాక..ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారు ప్రభాస్. ఇక ఆయన నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుందని గట్టి టాక్ వినిపిస్తోంది.