విడాకులపై కలర్స్ స్వాతి రియాక్షన్ ఇదే

టీవీ యాంకర్ గా యంగ్ ఏజ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది స్వాతి. కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకుని కలర్స్ స్వాతిగా మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన స్వాతికి స్వామి రారా, కార్తికేయ సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయిందీ హీరోయిన్.

2018లో తన ప్రియుడు, మలేషియా పైలట్ వికాస్ వసును పెళ్లి చేసుకుంది స్వాతి. ఇటీవల వీరి పెళ్లి డివోర్స్ గురించి రూమర్స్ బాగా వచ్చాయి. ఈ రూమర్స్ పై స్పందించింది కలర్స్ స్వాతి. ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు ప్రమోషన్ కార్యక్రమంలో తన విడాకుల గురించి అడిగిన ప్రశ్నకు కోపంగా రియాక్ట్ అయ్యింది.

విడాకుల గురించి తానేం మాట్లాడను అని చెప్పింది. పదహారేళ్ల వయసులో యాంకర్ గా టీవీ ఇండస్ట్రీకి వచ్చానని, అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల బతికిపోయానని స్వాతి అంది. సోషల్ మీడియా ఇప్పట్లా ఉండి ఉంటే ఆడుకునేవారని చెప్పింది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ కు వచ్చిన స్వాతి మూవీస్, వెబ్ సిరీస్ చేస్తోంది.