పార్లమెంట్ భవనంలో తమన్నా, మంచు లక్ష్మీ

స్టార్ హీరోయిన్ తమన్నా ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన మహిళల్ని పార్లమెంట్ కు ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అలా బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్, భూమి ఫెడ్నేకర్, షెహనాజ్ గిల్, సౌత్ నుంచి మంచు లక్ష్మి, తమన్నా, మెహరీన్ ఫిర్జాదా, ఖుష్బూ తదితరులు పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టారు. మూవీ స్టార్స్ రాకతో పార్లమెంట్ వద్ద మీడియా హడావుడి పెరిగింది. వీరితో మాట్లాడించేందుకు వారంతా ప్రయత్నించారు.

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా మహిళలకు రాజకీయాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని తమన్నా చెప్పింది. ఈ బిల్లు చారిత్రాత్మకమైనదని, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పింది తమన్నా. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిన సందర్భానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలా సినిమా తారలను పార్లమెంట్ కు ఆహ్వానించింది.