ఫేమస్ డిజైనర్ దగ్గరకు వరుణ్, లావణ్య

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ జంట తాజాగా ముంబై వెళ్లింది. అక్కడ ఫేమస్ డ్రెస్ డిజైనర్ మనీష్ మల్హోత్రాను కలిసింది. ఆయన దగ్గర తమ పెళ్లికి కావాల్సిన డ్రెస్సెస్ డిజైన్ చేయించుకునే వర్క్ మొదలుపెట్టారు. మనీష్ మల్హోత్రాను వరుణ్, లావణ్య కలిసి వీడియోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కెన్యాలో ఫ్యామిలీతో టూర్ చేసి తిరిగి వచ్చారు వరుణ్ తేజ్.

నవంబర్ ఫస్ట్ వీక్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ వివాహం జరగనుంది. వీరి పెళ్లికి ఇటలీలోని ఓ అందమైన రిసార్ట్ వేదిక కాబోతోంది. మూడు రోజుల పాటు వివాహ వేడుకలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకోసం మెగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇటలీ వెళ్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్ అనే బాలీవుడ్ మూవీతో పాటు కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే యాక్షన్ డ్రామా మూవీలో నటిస్తున్నారు.