“ఖుషి” సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్ కు లక్ష రూపాయల చొప్పున చెక్స్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ – ఖుషి సినిమా సక్సెస్ మా అందరికీ ఎంత ఖుషిని పంచిందో మీకు తెలుసు. మీ అందరి ఆదరణ వల్లే సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. మా సంతోషాన్ని మీతో కూడా పంచుకునేందుకు విజయ్ గారు ఈ ఇనిషేటివ్ తీసుకోవడం హ్యాపీగా ఉంది.అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – మీలో 100మందికి మా లవ్ షేర్ చేయాలనే ప్రయత్నం నా సినిమా ద్వారా విజయ్ మొదలుపెట్టడం హ్యాపీగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మా మూవీకి సౌత్ లో అన్ని ప్లేసెస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ నుంచి నేను ఇన్స్ పైర్ అయిన విషయం ఒకటుంది. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా విజయ్ ఒకేలా ఉంటాడు. ఇచ్చిన మాట మీద నిలబడతాడు.అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – నాకు ఇంత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్న వాడినే. ఇవాళ మీకు ఈ హెల్ప్ చేయగలుగుతున్నా అంటే అది నా పర్సనల్ కోరిక. ఈ లక్ష రూపాయలు అందిన తర్వాత కొంచెం సంతోషం కలిగి ఒత్తిడి తగ్గి, బలాన్నిచ్చి మీకు ఆనందంగా అనిపిస్తే నాకు అదే సంతృప్తినిస్తుంది. లాస్ట్ టైమ్ కొంతమంది పిల్లల్ని టూర్ కు పంపించా. ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పటి నుంచి 50 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే 100 మందికి మాత్రమే చేయగలుగుతున్నాం. ప్రతి ఇయర్ ఇంకొందరికి హెల్ప్ చేస్తా. ఇలా నేను స్ట్రాంగ్ గా ఉన్నంతవరకు, నేను సినిమాలు చేస్తున్నంతకాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థాంక్స్. అన్నారు.