సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. సోషల్ మీడియాలో వచ్చే కొత్త ప్లాట్ ఫామ్స్, ఫీచర్స్ ను ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటారు. మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా మై ఛానెల్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. టాలీవుడ్ నుంచి ఈ ఆప్షన్ అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ స్టార్ గా విజయ్ దేవరకొండ నిలిచారు.
ఇన్ స్టా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు విజయ్ దేవరకొండ. ఐయామ్ ఛానెలింగ్ ఆన్ వాట్సాప్.. మై వాట్సాప్ ఛానెల్ అంటూ ఇన్ స్టా స్టేటస్ ద్వారా వెల్లడించారు. బాలీవుడ్ లో పలువురు స్టార్స్ ఈ ఆప్షన్ క్రియేట్ చేసుకోగా..తెలుగు నుంచి ఫస్ట్ విజయ్ దేవరకొండ స్టెప్ వేశారు.
కెరీర్ పరంగా చూస్తే ఖుషి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్…పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.