తెలుగు, తమిళ చిత్రాల్లో టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా ఉండే సాయి పల్లవి చేసింది కొద్ది సినిమాలే అయినా అవన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రేజీ న్యూస్ ఆమె అభిమానులను ఖుషి చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది సాయి పల్లవికి బాలీవుడ్ డెబ్యూ కాబోతోంది. జునైద్ ఖాన్ ఇప్పటికే హీరోగా పరిచయమై కొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇటీవల కెరీర్ లో కాస్త స్లో అయిన సాయి పల్లవికి బాలీవుడ్ ఎంట్రీ అడ్వాంటేజ్ కానుంది.