కోటి వుమెన్స్ కాలేజ్ లో “గుంటూరు కారం” షూటింగ్, వీడియోస్ వైరల్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం బుల్లెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం కోటి వుమెన్స్ కాలేజ్ లో షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ టైమ్ లో భారీ సంఖ్యలో అమ్మాయిలు సెట్ దగ్గర సందడి చేశారు. మహేశ్ షూటింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న టైమ్ లో కేకలు అరుపులతో మహేశ్ ను గ్రీట్ చేశారు. మహేశ్ బాబు కళ్లద్దాలతో స్టైల్ గా షూటింగ్ పాల్గొంటున్న వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతాయి.

కోటి వుమెన్స్ కాలేజ్ ను కోర్టు హాల్ లా మార్చి గుంటూరు కారం షూటింగ్ చేస్తున్నారు. కోర్టు సంబంధించిన సీన్స్ ఈ సినిమాలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ ఇష్యూస్ కూడా చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కోటి వుమెన్స్ కాలేజ్ తో పాటు నగరంలోని ఓ స్టార్ హోటల్లోనూ ఈ సినిమా షూటింగ్ జరిపారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేసేందుకు టీమ్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు.