కంగ్రాట్స్ మామా..నవీన్ పోలిశెట్టికి నిఖిల్ విశెస్

టాలీవుడ్ లో లేటెస్ట్ సూపర్ హిట్ రికార్డ్ చేసింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా. నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఈ సినిమా సక్సెస్ పట్ల ఇండస్ట్రీ అంతా పాజిటివ్ గా స్పందిస్తూ శుభాకాంక్షలు చెబుతోంది. తాజాగా హీరో నిఖిల్ కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సక్సెస్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నిఖిల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ – హాయ్ నవీన్ పోలిశెట్టి మామా..మీ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. నువ్వు అందుకున్న ఈ హిట్ పట్ల సంతోషంగా ఉన్నాను. నేను వియత్నాంలో ఉండి మీ సినిమా చూడలేకపోయా. ఇక్కడ కూడా షో వేయొచ్చుగా. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీమ్ అందరికీ కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు.

నిఖిల్ ట్వీట్ కు నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ – థాంక్స్ నిఖిల్ బ్రో. వియత్నాంలో షో వేయిస్తా ష్యూర్ ఎక్కడ ఉన్నావో అడ్రస్ పెట్టు. అడ్రస్ పంపు. ఎప్పుడు ఇండియా వస్తున్నావ్. వచ్చాక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గురించి నీ రివ్యూ వినాలని అనుకుంటున్నా. మా టీమ్ నుంచి నీకు లవ్ పంపిస్తున్నా. అంటూ రిప్లై ఇచ్చారు. నిఖిల్, నవీన్ ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.