అల్లు అర్జున్, మహేశ్ తో జవాన్ డైరెక్టర్ మూవీస్

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తన సినిమాల్లో హీరోలను బాగా ఎలివేట్ చేస్తారు. ఆయన చూపించే హీరోయిజం స్పెషల్ గా ఉంటుంది. ఈ దర్శకుడికి తెలుగు హీరోలంటే ప్రత్యేక అభిమానం. హీరోయిజాన్ని, స్టార్ డమ్ ను ఇష్టపడే అట్లీ టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేయాలనే ఆసక్తి చూపిస్తుంటారు. వారిలో అల్లు అర్జున్, మహేశ్ లాంటి స్టార్స్ ఉన్నారు. వీరితో త్వరలోనే అట్లీ సినిమాలు చేయబోతున్నాడనే సూచనలు కనిపిస్తున్నాయి.

రీసెంట్ గా జవాన్ ఇంటర్వ్యూ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ అల్లు అర్జున్ కు ఓ కథ చెప్పానని, త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి న్యూస్ చెబుతామని అన్నారు. అలాగే మహేశ్ బాబు జవాన్ ను అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ పై అట్లీ స్పందించారు. తొందరలోనే మహేశ్ ను వచ్చి కలుస్తానని రీట్వీట్ చేశారు. దీంతో మహేశ్ తోనూ ఓ సినిమాకు అట్లీ సంప్రదిస్తున్నాడని తెలుస్తోంది. మహేశ్ కు రైజింగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలనే కోరిక ఉంటుంది. గతంలో తమిళ దర్శకుడు మురుగదాస్ తో స్పైడర్ అనే మూవీ చేశాడు.

ఒకప్పుడు తెలుగు హీరోలు తెలుగు దర్శకులతోనే, తమిళ హీరోలు, తమిళ దర్శకులతోనే సినిమాలు చేసేవారు. కానీ ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్ లో ఏ భాషలో దర్శకులైనా మరో ఇండస్ట్రీ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మన దగ్గర ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ తో వరుసగా సినిమాలు అనౌన్స్ చేశాడు. అట్లీ కూడా అదే దారిలో వెళ్తాడేమో.