వైష్ణవి టైమ్ మొదలైందా

యూట్యూబర్ గా కెరర్ ప్రారంభించి బేబి సినిమాతో హీరోయిన్ గా హిట్ కొట్టింది వైష్ణవి. ఈ సినిమాలో ఆమె నటనకు అందరి ప్రశంసలు దక్కాయి. చిన్న చిత్రంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టింది బేబి. ఈ సినిమాకు దాదాపు 93 కోట్ల రూపాయల గ్రాస్ దక్కింది. బేబి హిట్ తో వైష్ణవి క్రేజీ హీరోయిన్ గా మారింది.

ఈ క్రేజ్ ఇప్పుడు పలు ఆఫర్స్ తో నిజమవుతోంది. వైష్ణవికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో వైష్ణవిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే హీరో సిద్ధు జొన్నలగడ్డతో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న కొత్త చిత్రంలోనూ వైష్ణవిని నాయికగా అనుకుంటున్నారట.

ఈ రెండు సినిమాల్లోనూ వైష్ణవికి ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది. బేబిలో గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో ఆకట్టుకున్న వై‌ష్ణవికి ఈ రెండు సినిమాల్లోనూ పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయట. ఆశిష్, సిద్ధు కొత్త సినిమాలతో తన కెరీర్ బాగుంటుందని ఆశిస్తోందీ యంగ్ హీరోయిన్