పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా సలార్ పనులు స్పీడప్ చేశాడు. ఈ సినిమా డబ్బింగ్ పనులు తాజాగా మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే శృతి హాసన్ డబ్బింగ్ కంప్లీట్ చేయగా..రీసెంట్ గా ప్రభాస్ తన డబ్బింగ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
ఈ నెల 28 రెండు భాగాల సలార్ ప్రాజెక్ట్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కావాల్సి ఉండగా..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బెటర్ మెంట్ కోసం సినిమాను వాయిదా వేశారు. నవంబర్ లో సలార్ తొలి భాగం రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేస్తారనే వెర్షన్ కూడా బయటకొచ్చింది. ఏదైనా చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటన చేయాల్సిఉంది.