ఇంటర్నేషనల్ అవార్డ్ నామినీలో రశ్మిక

సైమా, ఫిలింఫేర్ వంటి జాతీయ స్థాయి అవార్డులు అందుకునే స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న మరో ప్రెస్టీజియస్ అవార్డ్ కు నామినేట్ అయ్యింది. నెదర్లాండ్ లోని ఆమ్ స్టర్ డామ్ లో నిర్వహించే సెప్టిమియస్ అవార్డుల్లో బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ విభాగంలో నామినేట్ అయ్యింది. ఎనిమిది మంది ఆసియా తారల్లో రశ్మికకు నామినేషన్ దక్కింది.

ఈ న్యూస్ ను రశ్మిక అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ ట్వీట్స్ కు రశ్మిక స్పందించింది. ఇదొక గొప్ప వార్త అని, అభిమానుల ప్రేమ వల్లే ఇలాంటి పురస్కారాలకు నామినేట్ అవుతున్నాననంటూ రీట్వీట్ చేసింది. ఈనెల 26న సెప్టిమియస్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఏషియన్ బెస్ట్ యాక్టర్స్ నామినీస్ లో మలయాళ హీరో టొవినో థామస్ కు చోటు దక్కింది.

పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు పలు బాలీవుడ్ చిత్రాలతో రశ్మిక మందన్న వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపే ఇలాంటి ఇంటర్నేషనల్ అవార్డులకు ఆమెను నామినేట్ చేస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ చేస్తున్న రశ్మిక. బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.