ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కు రణ్ వీర్, ఆలియా మూవీ

ఈ ఏడాది బాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన సినిమా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ. కరణ్ జోహార్ నిర్మించి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించారు. జూలై 28న రిలీజైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించింది. 300 కోట్ల రూపాయలకు పైగా నిర్మాతలకు తెచ్చిపెట్టింది.

ఆడియెన్స్ రివార్డ్స్ మాత్రమే కాదు అవార్డ్స్ ను కూడా ఈ సినిమా ఆకర్షిస్తోంది. తాజాగా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికవడంపై టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. దక్షిణ కొరియాలోని బుసాన్ లో వచ్చే 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఓపెన్ సినిమా సెక్షన్ లో అఫీషియల్ ఎంట్రీగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ ఎంపికైంది.