పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. సలార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ మూవీ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ కానుందని.. సెప్టెంబర్ 28న సలార్ సినిమా థియేటర్లోకి రానుందని ఎదురు చూస్తుంటే.. వాయిదా పడిందనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అయితే.. సలార్ వాయిదా పడడంతో చిన్న సినిమాలు, మీడియం సినిమాలు సలార్ డేట్ లో వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
రామ్, బోయపాటి కాంబోలో రూపొందుతోన్న మూవీ స్కంద. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఇప్పుడు సలార్ డేట్ అయిన సెప్టెంబర్ 28న స్కంద మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. సెప్టెంబర్ 28 అనేది లాంగ్ వీకెండ్ అండ్ హాలీడేస్ ఉన్నాయి. ఇది స్కందకు బాగా కలిసొస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. పాన్ ఇండియా మూవీగా వస్తున్న స్కంద ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.