తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. తన కొత్త సినిమా జవాన్ రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా షారుఖ్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. షారుఖ్ వెంట ఆయన సతీమణి గౌరీ ఖాన్, కూతురు సుహానా, జవాన్ హీరోయిన్ నయనతార ఉన్నారు.
షారుఖ్ ఖాన్ కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న షారుఖ్ ఖాన్ గర్భగుడిలో వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. షారుఖ్ రాకతో తిరుమలలో సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
షారుఖ్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమా ఎల్లుండి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై దర్శకుడు అట్లీ రూపొందించారు. నయనతార, విజయ్ సేతుపతి, దీపక కీ రోల్స్ చేశారు. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.