టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి శ్రావణి రెడ్డితో మహేశ్ విట్టా పెళ్లి నిన్న కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ కొందరు ఈ వేడుకకు హాజరయ్యారు. తన పెళ్లి ఫొటోలను ఇన్ స్టా ద్వారా షేర్ చేశారు మహేశ్. ఈ కొత్త జంటకు నెటిజన్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన మహేశ్ విట్టా రాయలసీమ యాసతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉండి పేరు తెచ్చుకున్నాడు. పలు చిత్రాల్లో ఆయన కమెడియన్ గా నటించారు. ఛలో, టాక్సీవాలా, కొండపొలం, అల్లుడు అదుర్స్ వంటి సినిమాలు మహేశ్ విట్టాకు కమెడియన్ గా గుర్తింపు తీసుకొచ్చాయి.