“సలార్” డేట్ కోసం ఇంత పోటీనా

డైనోసార్ పక్కకు తప్పుకుంటే చిన్నచిన్న యానిమల్స్ అన్నీ ఆ దారిలో పరుగులు పెట్టినట్లు..సలార్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావడంతో కనీసం అరడజను చిన్నా పెద్దా సినిమాలు ఆ డేట్ కు తమ సినిమాను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ప్రభాస్ సినిమాకున్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సలార్ ఆక్యుపై చేయబోయే థియేటర్స్ కనీసం ఒక అరడజను సినిమాలకు సరిపోతాయన్న మాట.

ప్రభాస్ సలార్ సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా…నవంబర్ కు వాయిదా పడింది. దీంతో రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రామ్ స్కంధ మూవీస్ తో పాటు కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ మరికొన్ని సినిమాలు ఈ నెల 28నే రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. రూల్స్ రంజన్ ఈ నెల 28 డేట్ అనౌన్స్ చేశారు. ఇక హీరో రామ్, డైరెక్టర్ బోయపాటి స్కంధ సినిమా ఈ నెల 15న రిలీజ్ కావాల్సి ఉండగా…తాజా అప్ డేట్ ప్రకారం సలార్ డేట్ కు 28న రావాలని భావిస్తున్నారట.

ఇక రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20 దసరా రిలీజ్ నుంచి సలార్ డైట్ అయిన ఈ నెల 28 రిలీజ్ కు షిప్ట్ చేద్దామని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడప్ చేస్తున్నారట. ఇలా ముందొచ్చే సినిమాను, వెనక రావాల్సిన సినిమాలన్నీ సలార్ ఖాళీ చేసిన స్లాట్ కోసం పోటీలు పడుతున్నాయి. డైనోసార్ మూవీ అంటే ఇదేమరి.