పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా హరి హర వీరమల్లు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది అనేది ఆ న్యూస్ చెబుతున్న మాట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కన్ఫర్మ్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ ఓజీ రెండు భాగాలుగా వస్తుందనే న్యూస్ వస్తున్న ఈ టైమ్ లో హరి హరకు కూడా సెకండ్ పార్ట్ ఉంటుందనే వార్తలు అభిమానులను ఉత్సాహాన్నిస్తున్నాయి.
వాస్తవానికి హరి హర వీరమల్లు షూటింగ్ ఇప్పటికే షూటింగ్ పూర్తయి రిలీజ్ కు రెడీ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. లాక్ డౌన్ ముందు మొదలైన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పవన్ ఈ సినిమాకు కావాల్సినన్ని డేట్స్ కేటాయించకపోవడమే అసలు సమస్యగా తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యాకే తిరిగి హరి హర వీరమల్లు సెట్ లోకి వెళ్లనుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, బాబీ డియోల్, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.