స్టార్ హీరో ప్రభాస్ సలార్ ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా..నవంబర్ కు వాయిదా పడింది. ఈ డేట్ స్పేస్ ను ఉపయోగించుకోవాలని రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు టీమ్ భావిస్తోంది. అయితే ఆ డేట్ కు రవితేజ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న పెద్ద డౌట్.
టైగర్ నాగేశ్వరరావు సినిమాను దసరా పండక్కి అక్టోబర్ 20న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. ఎప్పుడైతే సలార్ ఈ నెల 28న రావడం లేదని తెలిసిందో..ఆ డేట్ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకోవాలని టైగర్ నాగేశ్వరరావు టీమ్ నిర్ణయించింది. అయితే సినిమా పీరియాడిక్ డ్రామా కాబట్టి చాలా సీజీ షార్ట్స్ ఉన్నాయట. ఈ సీజీ వర్క్ ఇంత వేగంగా పూర్తి కావడం కష్టంగా మారింది. దీంతో ఈ సినిమాను సలార్ డేట్ కు రిలీజ్ చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఇందుకే సినిమా టీమ్ ఎక్కడా తమ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం లేదట.
రవితేజ హీరోగా స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు వంశీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.