ప్రేయసిని పెళ్లాడిన హీరో త్రిగుణ్

యువ హీరో త్రిగుణ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి నివేదితతో ఆయన పెళ్లి ఇవాళ జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో తమిళనాడులోని తిరుప్పూర్ లో త్రిగుణ్, నివేదిత వివాహం చేసుకున్నారు. ఈ యువ హీరో వెడ్డింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీ సహచరులు ఈ కొత్త జంటకు విశెస్ చెబుతున్నారు.

కథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అరుణ్ ఆదిత్. గతేడాది జనవరిలో తన పేరును త్రిగుణ్ గా మార్చుకున్నాడు. తుంగభద్ర, పీఎస్ వీ గరుడవేగ, 24 కిస్సెస్, డియర్ మేఘ, కొండా, ప్రేమదేశం తదితర చిత్రాల్లో త్రిగుణ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం ఆయన మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.