ఓ హిట్ మూవీ ఆ ఇద్దరు స్టార్ హీరోలను కలిపింది

బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, సన్ని డీయోల్ మధ్య కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడూస్తూ వచ్చింది. వీళ్లిద్దరు కలిసి యష్ చోప్రా రూపొందించిన ధార్ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో ఈ ఇద్దరు హీరోల మధ్య విబేధాలు తలెత్తాయి. దాంతో అప్పటి నుంచి షారుఖ్, సన్నీ డియోల్ కలిసి ఎక్కడా కనిపించలేదు.

కానీ ఇన్నేళ్ల తర్వాత ఓ సక్సెస్ ఫుల్ సినిమా ఈ ఇద్దరు స్టార్స్ ను కలిపింది. సన్నీడియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా 500 కోట్ల రూపాయల వసూళ్లతో సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీంతో సక్సెస్ పార్టీ ఇచ్చాడు సన్నీ డియోల్. ఈ పార్టీకి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ఇండస్ట్రీ స్టార్స్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుఖ్, సన్నీ డియోల్ కలిసి ఫొటోలు దిగారు. ఈ పార్టీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అ‌వుతున్నాయి.