పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ గురించి మరో సెన్సేషనల్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్నీ సీక్వెల్స్ గా తెరకెక్కుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, సలార్ తర్వాత ఈ ట్రెండ్ బాగా పాపులర్ అయ్యింది. పవన్ ఓజీ కూడా ఇదే వేలో వెళ్తున్నట్లు సమాచారం. ఓజీని రెండు భాగాలుగా రూపొందించబోతున్నారట.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఓజీకి సెకండ్ పార్ట్ ఉంటుందని లేటేస్ట్ గాసిప్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇప్పుడొస్తున్న సినిమా ఫస్ట్ పార్ట్ కాగా..సెకండ్ పార్ట్ షూట్ చేయాల్సిఉంటుంది. ఓజీ పవర్ స్ట్రోమ్ ను ఇవాళ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఒక చిన్న శాంపిల్ గా చూపించింది. అతి తక్కువ టైమ్ లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకుందీ గ్లింప్స్. వచ్చే ఏడాది సమ్మర్ లో ఓజీ రిలీజ్ కాబోతోంది.