సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ టైగర్ 3. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ 3లో సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా టైగర్ 3 నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.
బాలీవుడ్ టైగర్ సక్సెస్ ఫుల్ సిరీస్ గా చెప్పుకోవచ్చు. 2012 లో వచ్చిన ఏక్ థా టైగర్ , 2017లో రిలీజైన టైగర్ జిందా హై ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు టైగర్ 3 పేరుతో థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ వస్తోంది. ఈ సినిమాతో మరోసారి టైగర్ పాత్రలో సల్మాన్, జోయా క్యారెక్టర్ లో పాకిస్థాన్ గూఢచార ఏజెంట్ గా కత్రీనా జోడి తెరపై కనిపించబోతోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజెస్ లో టైగర్ 3 గా ఉండనుంది.