స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ వచ్చే జనవరికి వాయిదా పడిందంటూ వార్తల్ని నిన్నటి నుంచి చూశాం. అయితే ఈ నెల 28 నుంచి రిలీజ్ డేట్ మారిన మాట మాత్రం వాస్తవం కాగా…వాయిదా పడింది వచ్చే ఏడాది జనవరికి కాదు ఈ ఏడాది నవంబర్ కే అని తెలుస్తోంది. ఈ నవంబర్ లో రిలీజ్ పక్కా అని అంటున్నారు. సలార్ నవంబర్ రిలీజ్ అప్ డేట్ వైరల్ అవుతోంది.
నవంబర్ 10న సలార్ రిలీజ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించలేదు. కానీ ప్రముఖ క్రిటిక్స్ తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా ఈ డేట్ ను సర్క్యులేట్ చేస్తున్నారు. సీజీ వర్క్ లో ఆలస్యం కారణంగా సలార్ రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే యూఎస్ బుకింగ్స్ హాఫ్ మిలియన్ డాలర్స్ దాటగా..టికెట్స్ కొన్న వారందరికీ రీఫండ్ చేస్తున్నారు.