సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్. జైలర్ ఓటీటీ డేట్ కన్ఫర్మ్ చేస్తూ ఇవాళ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
హిందీ సహా నాలుగు దక్షిణాది భాషల్లో జైలర్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. తెలుగులోనూ జైలర్ మంచి వసూళ్లను సాధించింది. జైలర్ ఓటీటీలో చూసేందుకు తెలుగు ప్రేక్షకులూ ఎదురుచూస్తున్నారు. గత నెల 10న రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది జైలర్ సినిమా.
దాదాపు 600 కోట్ల రూపాయల వసూళ్లతో రికార్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు వచ్చిన లాభాలను దర్శకుడు నెల్సన్, హీరో రజనీకి షేర్ చేసిన చిత్ర నిర్మాత కళానిధి మారన్…తాజాగా వారిద్దరికి బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు.