పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ గ్లింప్స్ వచ్చేసింది. హంగ్రీ చీతా పేరుతో పవన్ బర్త్ డే సందర్భంగా ఇవాళ 10.35 నిమిషాలకు రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ పవర్ ఫుల్ యాక్షన్ తో పవర్ స్ట్రోమ్ తీసుకొచ్చింది. పవన్ ఇప్పటివరకు కనిపించని ఫెరోషియస్ క్యారెక్టర్ ను ఓజీలో చేస్తున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే.
పదేళ్ల క్రితం వచ్చిన తుఫాన్ ముంబైలో సగం ఊరినే ఊడ్చేసింది కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫానూ కడగలేకపోయింది అంటూ మొదలైన గ్లింప్స్…స్వార్డ్ ఫైటింగ్ తో పవన్ చేసిన అదిరిపోయే యాక్షన్ ను చూపించింది. చివరలో పవన్ కోపంగా ఊగిపోతూ చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలించింది. ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను ఓజీ మన ముందుకు తీసుకురాబోతున్నట్లు హంగ్రీ చీతా గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హశ్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.