విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ప్రేమను యునానమస్ గా పొందుతున్న ఖుషి సక్సెస్ మీట్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – ఖుషి సినిమాను ప్రేక్షకులు యూనానమస్ గా సూపర్ హిట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ నుంచి యూఎస్ కాల్స్ వస్తున్నాయి. సినిమా ఘన విజయం అందుకుందని చెబుతున్నారు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరూ ఖుషి మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.అన్నారు. నిర్మాత వై రవి శంకర్ మాట్లాడుతూ – మేము ఖుషి కథ విన్నప్పుడు ఎలాంటి నమ్మకం పెట్టుకున్నామో..ఆ నమ్మకాన్ని నిజం చేసేలా రిజల్ట్ వచ్చింది. బాక్సాఫీస్ నెంబర్స్ షో బై షో పెరుగుతూ ఉన్నాయి.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఖుషికి థియేటర్స్ లో లాంగ్ రన్ ఉంటుంది. సినిమా విడుదలైన ప్రతి చోట నుంచి ఎక్స్ ట్రార్డినరీ రిపోర్ట్ వస్తోంది. విజయ్ సూపర్బ్ పర్మార్మెన్స్ చేశాడు. అలాగే సమంత నటన ఎంతో బాగుంది.అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ఖుషి సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమా బాగుందంటూ మీడియా పర్సన్స్ నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. సినిమాను మీడియా కరెక్ట్ గా జడ్జ్ చేస్తుందని నమ్ముతాను. అలాంటి మీడియా నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందంగా ఉంది. దేవుడు, నమ్మకాలు, కర్మ సిద్ధాంతం అనేది మన దేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఈ నేపథ్యంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇప్పుడున్న సొసైటీకి చెప్పాలనుకుని రెండేళ్ల కిందట ఖుషి కథ రాసుకున్నాను. ఆ పాయింట్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఫన్ అండ్ ఎమోషన్ ను విజయ్ తన నటనలో అద్భుతంగా చూపించాడు. అలాగే సమంత గారి పర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. స్టార్ గా తన ఇమేజ్ కాకుండా విప్లవ్ క్యారెక్టర్ ను అర్థం చేసుకుని విజయ్ నేచురల్ గా నటించాడు. ఖుషి చూసి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తోనే వస్తారు. అన్నారు.