దాదాపు నెల రోజుల ముందుగానే ప్రభాస్ సలార్ మేనియా యూఎస్ బాక్సాఫీస్ ను ముంచెత్తుతోంది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కు వస్తుండగా…యూఎస్ లో ప్రీ సేల్ బుకింగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ ప్రీ సేల్ టికెట్ బుకింగ్స్ హాఫ్ మిలియన్ డాలర్స్ కు చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఓ సినిమా తన ఫుల్ రన్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ బాక్సాఫీస్ వద్ద సాధిస్తే అదే గొప్ప విషయం అనుకుంటే రిలీజ్ ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ ఫీట్ సాధించడం సలార్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇది మరికొద్ది రోజుల్లో వన్ మిలియన్ డాలర్స్ కు చేరినా చేరొచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి.సలార్ హాఫ్ మిలియన్ డాలర్ ప్రీ సేల్స్ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ చిత్రాన్ని రూపొందించారు. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 3న సలార్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.