షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తమిళ దర్శకుడు అట్లీ రూపొందించారు. దీపికా పడుకోన్, నయనతార, విజయ్ సేతుపతి కీ రోల్స్ ప్లే చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. షారుఖ్ పఠాన్ సూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి జవాన్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. జవాన్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
ఒక రాజు చేసిన ప్రతి యుద్ధంలో ఓడిపోతూ వచ్చాడు. దాహంతో, ఆకలితో అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ముంబై మెట్రో రైల్ లో ప్రయాణికుల కిడ్నాప్ జరుగుతుంది. నిందితుడు తన డిమాండ్స్ పోలీసుల ముందుంచుతాడు. నీకేం కావాలని అడిగితే ఆలియ భట్ కావాలంటాడు. మరోవైపు షారుఖ్ ను ఐదారు విభిన్నమైన క్యారెక్టర్స్ లో చూపించారు. అందులో జవాన్, పోలీస్, విలన్..ఇలాంటి పాత్రల్లో షారుఖ్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించారు. విజయ్ సేతుపతి ఆయుధాల డీలర్ గా ఫెరోషియస్ గా ఉన్నాడు. ఇక జవాన్ లో మరో ప్రత్యేకత లేడీ క్యారెక్టర్స్. నయనతార, దీపికా పడుకోన్., సాన్య మల్హోత్రా, ప్రియమణి ఇలా హీరోయిన్స్ కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. హెలికాప్టర్స్ తో వార్ సీన్స్, దీపికా, షారుఖ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు కథను మాత్రం ఎక్కడా రివీల్ చేయకుండా జవాన్ ట్రైలర్ సాగడం విశేషం.