రికార్డ్ ప్రైస్ కు “సలార్ 1” నైజాం రైట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్. రెండు భాగాల ఈ సినిమా మొదట భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ క్రేజ్ సలార్ 1 కు జరుగుతున్న బిజినెస్ పై స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్ రికార్డు ధర పలికినట్లు తెలుస్తోంది.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన ఈ సినిమా నైజాం హక్కుల కోసం 65 కోట్ల రూపాయలు ధర చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నైజాం ఏరియా రైట్స్ కు చెల్లించిన భారీ ప్రైస్ గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ కున్న స్టార్ డమ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత రెండు సినిమాలు కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 పాన్ ఇండియా స్థాయిలో సాధించిన రికార్డ్ విజయాలు సలార్ 1కు డిస్ట్రిబ్యూషన్ లో ఇంత భారీ డిమాండ్ తీసుకొస్తున్నాయి.

ఇండియాలోనే కాదు యూఎస్ లో కూడా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీకి గతంలో ఏ సినిమాకు జరగనన్ని ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రాజమన్నార్ క్యారెక్టర్ పోషిస్తున్నారు.