కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడనే విషయం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నారు. ఇవాళ నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడించింది. నాగార్జునకు బర్త్ డే విశెస్ చెబుతూనే తమ సినిమాలో ఆయన పార్ట్ అయినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ధనుష్ కున్న ఇమేజ్, దర్శకుడిగా శేఖర్ కమ్ముల ప్రతిభ తెలుసు కాబట్టి ఈ సినిమా తప్పకుండా బాగుంటుందని ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్ లో రివీల్ చేసినట్లు సమాజంలోని పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాల నేపథ్యంతో కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది.
తన ప్రతి సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు ఏదో ఒక సోషల్ మెసేజ్ చెబుతూ ఉంటారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇందులోనూ ఆయన అలాంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. ఇక ఈ కథలో నాగార్జున రోల్ ఎలా ఉండబోతోంది. ఆయనను శేఖర్ కమ్ముల ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి ఏర్పడుతోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.