ప్లానింగ్ లో… ఆర్ఎక్స్ 100 సీక్వెల్..?

ఆర్ఎక్స్ 100 సినిమా ఊహించని విజయం సాధించి సంచలనం సృష్టించింది. హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్, డైరెక్టర్ అజయ్ భూపతి ముగ్గురికి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా ఆతర్వాత ఈ ముగ్గురు తమ తమ సినిమాల్లో బిజీ అయ్యారు. కార్తికేయ బెదురులంక సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. పోటీగా మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ఉన్నప్పటికీ బెదురులంక సక్సెస్ కావడం విశేషం. ఇక అజయ్ భూపతి మంగళవారం అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు.

అయితే.. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 టీమ్ ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. అవును.. ఆర్ఎక్స్ 100 సినిమాకి సీక్వెల్ చేయాలని అజయ్ భూపతికి ఎప్పటి నుంచో ప్లాన్ ఉందట. ప్రస్తుతం అజయ్ చేస్తున్న మంగళవారం అనే సినిమా విడుదల తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ వస్తుందని టాక్ వినిపిస్తుంది. కార్తికేయ మాత్రం అజయ్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఆర్ఎక్స్ 100 సీక్వెల్ చేస్తే కనుక మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. అజయ్ ఏం చేస్తాడో చూడాలి.