సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ డిజాస్టర్ అయినప్పటి నుంచి కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఖుషి అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా చేస్తున్న విజయ్.. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. అయితే… ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఇంతకీ.. విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ స్టోరీ ఏంటి..? అనుకుంటున్నారా..? గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేసే మూవీ స్టోరీ ఏంటంటే.. పవర్ ఫుల్ పోలీసాఫర్ గా కనిపించే విజయ్ ఆతర్వాత గ్యాంగ్ స్టర్ గా మారతాడట. పోలీస్ కాస్తా గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాల్సివచ్చింది..? అనేదే ఈ సినిమా కథ అని టాక్. ఈ రకమైన స్టోరీ లైన్ తోనే పూరి జగన్నాథ్.. గోలీమార్ అనే సినిమా చేశాడు. అది కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఇంచుమించు అదే స్టోరీ లైన్ తోనే విజయ్ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనేది తెలియాల్సివుంది.