పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి లవ్ స్టోరీలో కనిపించబోతున్నారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఈ దసరాకు ఫార్మల్ గా లాంఛ్ అవుతుందట.
ఆర్మీ నేపథ్యంగా సాగే ఓ విభిన్న ప్రేమ కథను ఈ చిత్రంలో దర్శకుడు హను తెరకెక్కించనున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ కెరీర్ లో అటు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ ఎంటర్ టైనర్, ఇటు హను డైరెక్ట్ చేసే లవ్ స్టోరి కొత్తగా ఉండబోతున్నాయి. దసరాకు లాంఛ్ అయ్యే ఈ మూవీ కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుందట.
ప్రభాస్ ప్రస్తుతం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ సన్నాహాల్లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ యూఎస్ టికెట్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా వైజ్ గా సలార్ 1 పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.