‘ఖుషి’ మ్యూజికల్ మ్యాజిక్ చేస్తుందంటున్న సంగీత దర్శకుడు హేషమ్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి అందించారు హేషమ్ అబ్దుల్ వాహబ్. ‘ఖుషి’ సినిమా బిగ్ స్క్రీన్ మీద మ్యూజికల్ మ్యాజిక్ చేస్తుందంటున్నారాయన.

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ – ‘ఖుషి’ సినిమాకు పనిచేయడం ఒక థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నిన్న మొత్తం మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేసేవరకు ఎగ్జైటింగ్ గా మా జర్నీ సాగింది. రేపు ప్రేక్షకులు సినిమాలో మ్యూజికల్ మ్యాజిక్ చూస్తారు.
‘ఖుషి’ సినిమా కోసం వీణ, సితార్ వంటి ఇస్ట్రుమెంట్స్ వాడాం. నా రోజా నువ్వే పాట నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓసి పెళ్లామా వరకు అన్ని పాటలు బాగా కుదిరాయి. విదేశాలకు వెళ్లినా కూడా ‘ఖుషి’ పాటల గురించి మాట్లాడుతున్నారు. అదే మాకు పెద్ద అఛీవ్ మెంట్. శివ మ్యూజిక్ గురించి ప్యాషన్ దర్శకుడు. అతనికి ఏం కావాలో తెలిసిన దర్శకుడు. మేము ఒక హోటల్ లో నెల రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాం. నేను ఎక్కువ రోజులు ఒక సినిమాకు పనిచేసింది కూడా ‘ఖుషి’కే. హీరో విజయ్ కు తన సినిమాల నుంచి ఆడియన్స్ ఎలాంటి మ్యూజిక్ కోరుకుంటారో తెలుసు. అందుకే తన సజెషన్స్ నాకు చెప్పేవాడు. ‘ఖుషి’లో సమంత, విజయ్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అన్నారు.