“కేజీఎఫ్” స్టైల్లో “ఏ మాస్టర్ పీస్” ప్రీ టీజర్

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. తన గత చిత్రాలతో కొత్త కొత్త ఎలిమెంట్స్ పెట్టి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారీ దర్శకుడు. ఇప్పుడు సూపర్ హీరో జానర్ లో తెలుగు తెరపై ఒక కొత్త అటెంప్ట్ చేయబోతున్నారు. అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్ తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది.

ఓ సూపర్ హీరో, మదర్ సెంటిమెంట్, సొసైటీలో క్రైమ్స్ చేసే కొందరు విలన్స్…ఇలా కేజీఎఫ్ స్టైల్ ప్యాట్రన్ పెట్టుకున్నాడు దర్శకుడు సుకు పూర్వాజ్. డైలాగ్స్ కూడా కేజీఎఫ్ ను గుర్తుచేసేలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. చిన్నప్పుడు ఎదురు తిరగవద్దు అని చెప్పిన తల్లే వాడు ఎదురొస్తే డీల్ చేసే దమ్ము నీకుందా అనడం హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా ఉంది. బలమున్న వాడిని పట్టుకోవాలంటే పవర్ కావాలి. కానీ నీలా బలం ఫ్లస్ పవర్ ఉన్నవాడిని పట్టుకోవాలంటే ఎమోషన్ కావాలి..అనే పవర్ పంచ్ లు ఆకట్టుకున్నాయి.

మొత్తంగా “ఏ మాస్టర్ పీస్” తెలుగు నేటివిటీకి కావాల్సిన కమర్షియల్ ఫార్మేట్ సూపర్ హీరోను తెరపై చూపించబోతోందని ప్రీ టీజర్ తో అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.