బన్నీ, ఎన్టీఆర్, మహేష్ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం ఆమధ్య మారేడుమిల్లి, కేరళలో షూటింగ్స్ చేశారు. ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేస్తున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీకి ఉత్తమ నటుడుగా అవార్డ్ రావడం కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు కానీ.. లేకపోతే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేయాలి. అక్కడ ప్రత్యేకంగా ఓ సెట్ వేశారట. ఆ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. ఇక నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేసి సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. దేవర సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న దేవర చిత్రం శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఆమధ్య ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల పై యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.

మహేష్ గుంటూరు కారం షూటింగ్ విషయానికి వస్తే… ప్రస్తుతం సారధి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ వారం రోజుల్ల్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తే… మహేష్ బాబు మూడు రోజుల్లోనే పూర్తి చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. నవంబర్ కి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.