రామ్ పై ఊగిపోయిన బాలకృష్ణ..కారణమిదే?

రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంధ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చారు బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో రామ్, బాలకృష్ణ మధ్య జరిగిన సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణతో ఫన్ చేయాలనుకున్న రామ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు బాలకృష్ణ స్టేజీ మీదే వార్నింగ్ లాంటివి ఇస్తూ హడలగొట్టాడు. ఏం జరిగిందో చూస్తే…

డైరెక్టర్ బోయపాటితో తనకున్న అనుబంధం నేపథ్యంలో బాలకృష్ణ స్కంధ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వచ్చారు. స్టేజీ మీద రామ్ మాట్లాడుతున్న టైమ్ సుమ హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి అడగగా….రామ్ స్పందిస్తూ బాలకృష్ణ వేదిక మీద ఉండగా..వేరే వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడగలమా అంటూ సెటైర్ విసిరాడు. దీనికి బాలకృష్ణ కోపంగా రామ్ ను చూస్తూ హీరోయిన్స్ గురించి మాట్లాడు అంటూ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు.

అలాగే బాలకృష్ణ గురించి ఒక పాట పాడాలి అని రామ్ అన్నప్పుడు కూడా ఆయన ఇలాగే ఫైర్ అవుతూ కనిపించాడు. ఒక్కోసారి బాలకృష్ణ రామ్ దగ్గరకు కోపంగా వెళ్లడం చూస్తుంటే ఇంకో చేస్తాడో ఏంటో అనే భయం కూడా అందరిలో కలిగింది. బాలకృష్ణ ఎప్పటిలాగే తన ధోరణిలో స్పీచ్ ఇచ్చాడు. చివరలో రామ్ జైలర్ సినిమాలోని హుకుం పాట లిరిక్స్ పాడి…బాలకృష్ణ గొప్పదనం చెప్పడంతో వేడెక్కిన వాతావరణం కూల్ అయ్యింది.