రేపు విడుదల కానున్న ఎన్టీఆర్ రూ.వంద కాయిన్

ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయల కాయిన్ ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కాయిన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పురంధేశ్వరితో పాటు జూనిర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది.

ఎన్టీఆర్ పేరు, ఫొటోతో ఉన్న ఈ వంద రూపాయల బిళ్ల ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీకి చెందిన వారు ఈ ఫొటోస్ ను షేర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. రాజకీయాలు, సినిమా రంగంలో ఎన్టీఆర్ చేసిన కృషికి జాతీయ స్థాయిలో దక్కిన గుర్తింపుగా ఈ వంద రూపాయల కాయిన్ విడుదలను చెప్పుకోవచ్చు.