పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. పుష్ప సినిమా బాలీవుడ్ ని షేక్ చేయడంతో పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల బన్నీ పుట్టినరోజున పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ దక్కించుకున్నాడు.

దీంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే.. ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించి అనేలా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే.. పుష్ప 2 రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు కానీ.. మార్చి 22న ఈ భారీ, క్రేజీ మూవీని రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి.. పుష్ప 2 ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో… ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేయనుందో చూడాలి.