రీసెంట్ టాలీవుడ్ సూపర్ హిట్ బేబి. చిన్న చిత్రంగా రిలీజై ఘన విజయాన్ని సాధించిందీ సినిమా. బేబి ప్రొడ్యూసర్స్ కు లాభాలతో పాటు హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లో ఆమె నటన యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. బేబి సక్సెస్ క్రేజ్ తో వైష్ణవికి ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓ ముగ్గురు యంగ్ హీరోస్ మూవీస్ లో వైష్ణవి హీరోయిన్ గా సైన్ చేసినట్లు సమాచారం. ఈ మూడు సినిమాలు ఆమె కెరీర్ ను స్పీడప్ చేయనున్నాయి. తెలుగు హీరోయిన్స్ కొరత ఉన్న నేపథ్యంలో వైష్ణవికి లాంగ్ కెరీర్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడున్న ఇండస్ట్రీ లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
బేబి వంటి సూపర్ హిట్ ఉన్న వైష్ణవికి క్రేజీ ఆఫర్స్ రావడం సహజమే. ఇక ఆమె కొత్త సినిమాల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరోవైపు బేబి సినిమా ఇటీవల ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అతి తక్కువ టైమ్ లో 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుందీ సినిమా.