పవర్ స్టార్ టైటిల్ తో నితిన్ సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను బాగా అభిమానిస్తాడు హీరో నితిన్. ఇప్పుడు తన ఫేవరేట్ హీరో సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ తో నితిన్ సినిమా చేస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేయగా..దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

తమ్ముడు సినిమా లాంఛ్ సందర్బంగా హీరో నితిన్ ట్వీట్ చేస్తూ…తమ్ముడు టైటిల్ పెట్టుకోవడం ఎంతో బాధ్యతగా ఫీలవుతున్నట్లు చెప్పాడు. ప్రేక్షకుల అంచనాలను మించి తమ సినిమా ఉంటుందని తెలిపాడు. వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు చేస్తున్న చిత్రమిది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. సేతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడించబోతున్నారు.