పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. ఆ రోజున అభిమానులకు పండగ రోజు. అయితే.. పవర్ స్టార్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ట్రిపుల్ ట్రీట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే… పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆమధ్య ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇక వపన్ నటిస్తున్న మరో మూవీ ఓజీ. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండడం… పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచి ఓజీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఎప్పుడెప్పుడు ఓజీ గ్లింప్స్ విడుదల చేస్తారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.