సలార్ ట్రైలర్ కు అంతా రెడీ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి సలార్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ సాధించకపోవడంతో సలార్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని.. ప్రభాస్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. దీంతో ఎప్పుడెప్పుడు సలార్ మూవీ వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సెప్టెంబర్ 28న సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ట్రైలర్ ను ఆగష్టు నెలాఖరున రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు కానీ.. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారో అనౌన్స్ చేయలేదు. దీంతో సలార్ ట్రైలర్ ఎప్పుడు..? అప్ డేట్ ప్లీజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అడుగుతుండడం వైరల్ అయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన సలార్ గ్లింప్స్ అయితే.. యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారంటే.. సెప్టెంబర్ 7న విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ ట్రైలర్ ను డైరెక్ట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేయకుండా గ్రాండ్ గా ఈవెంట్ చేసి విడుదల చేయాలి అనుకుంటున్నారట. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.