షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై షారుఖ్ నిర్మించారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను రూపొందించారు. నయనతార, విజయ్ సేతుపతి, దీపిక పదుకొన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఆస్క్ ఎస్సార్కే నిర్వహించారు షారుఖ్ ఖాన్. ఈ ఛిట్ ఛాట్ లో ప్రేక్షకులు, అభిమానులు అడిగిన రకరకాల ప్రశ్నలకు షారుఖ్ సమాధానాలు చెప్పారు. ఇందులో కొన్ని పర్సనల్ ప్రశ్నలు కూడా అడిగారు. కొన్నింటికి జవాబులు చెప్పిన షారుఖ్…మీ వ్యక్తిగత సమస్యలకు నేను పరిష్కారం చెప్పలేనంటూ తప్పుకున్నారు.
ఒక అభిమాని మీరు గుండుతో నటించినప్పుడు ఎలా ఉందని అడగగా…షారుఖ్ స్పందిస్తూ..పఠాన్ సినిమా తర్వాత ఏదైనా కొత్తగా చేయాలని అనిపించింది. అందుకే గుండు గెటప్ ను ఛాలెంజ్ గా తీసుకున్నా అన్నారు. ఇంకో ఆడియెన్ జవాన్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ అడిగారు. ట్రైలర్ గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తుండటంతో విసిగిపోయిన షారుఖ్…ట్రైలర్..ట్రైలర్..ట్రైలర్…ట్రైలర్ రిలీజ్ చేయకుంటే సినిమా చూడరా..ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయాలో మా డైరెక్టర్ డిసైడ్ చేస్తారంటూ చెప్పారు. మరో వ్యక్తి మా భార్య సినిమాకు వెళ్లేప్పుడు త్వరగా రెడీ కాదు మీ పఠాన్ సినిమాకు అందుకే లేట్ గా వెళ్లాల్సి వచ్చిందని అడగగా…భార్యల సమస్యలను నాకు చెప్పకండి అంటూ షారుఖ్ జోక్ చేశారు. ఇలా ఆస్క్ ఎస్సార్కే ఫన్ ఛాట్ తో సాగింది.